Social Media Love Stories: సరిహద్దులు దాటుతున్న ప్రేమ కథలు, సినిమాను తలపించే ట్విస్టులు!

సోషల్ మీడియా రాకతో నిజజీవితంలో సరికొత్త ప్రేమ కథ చిత్రాలు వెలుగుచూస్తున్నాయి.

  • Written By:
  • Updated On - August 5, 2023 / 05:11 PM IST

ఎప్పుడైతే సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిందో లోకల్ టు గ్లోబల్ అనేంతగా పరిచయాలు పెరిగిపోయాయి. ఆ పరిచయాలు స్నేహాలతో మొదలై, చివరకు పెళ్లిళ్లకు దారితీస్తున్నాయి. ఇటీవల మరో సీమాంతర ప్రేమకథలో శ్రీలంకకు చెందిన 25 ఏళ్ల యువతి తన ఏడేళ్ల ఫేస్‌బుక్ స్నేహితుడైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడితో పెళ్లి చేసుకుంది. జులై 8న పర్యాటక వీసాపై భారత్‌కు వచ్చిన విక్నేశ్వరి శివకుమార చిత్తూరు జిల్లా అరిమాకులపల్లె గ్రామానికి చెందిన డి.లక్ష్మణ్‌ను వివాహం చేసుకున్నారు. ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ ఈనెల వెంకటగిరికోటలోని ఓ దేవాలయంలో పెళ్లి చేసుకున్నారు.

భవన నిర్మాణ కార్మికుడిగా లక్ష్మణ్ (24) జీవనం సాగిస్తున్నాడు. ఈ జంట మొదట 2017లో ఫేస్‌బుక్‌లో కనెక్ట్ అయ్యారు. అప్పటి నుండి వారు రెగ్యులర్ టచ్‌లో ఉన్నారు. విక్నేశ్వరి శ్రీలంకలోని వెలంగుడి నివాసి. స్నేహం ప్రేమగా వికసించి చివరకు లక్ష్మణ్‌ను వివాహం చేసుకోవడానికి భారతదేశానికి రావాలని నిర్ణయించుకుంది. టూర్‌కు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. లక్ష్మణ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీలంక మహిళ స్థానిక ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లో ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంది. దీంతో అనుమానం వచ్చిన అధికారులు పోలీసులకు సమాచారం అందించడంతో పెళ్లి విషయం వెలుగులోకి వచ్చింది. టూరిస్ట్ వీసా గడువు ముగిసే ఆగస్టు 6వ తేదీలోపు శ్రీలంకకు తిరిగి రావాలని పోలీసులు ఆమెకు నోటీసులు అందించారు. అయితే సుదీర్ఘ వీసా ఆధారిత వివాహ ధృవీకరణ పత్రం కోసం విక్నేశ్వరి ఫారినర్స్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)కి దరఖాస్తు చేసుకున్నారు. కేవలం ఫేస్ బుక్ పరిచయంతోనే ఈ జంట పెళ్లి చేసుకోవడం విశేషం.

ఇక పబ్జీ ఆటలో కుదురిన ప్రేమ పేరుతో భారత్‌లోకి ప్రవేశించి, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సచిన్‌ మీనా అనే వ్యక్తిని పెండ్లి చేసుకొన్న పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన సీమా హైదర్‌ అనే మహిళ కథ అందరికీ తెలిసిందే. అయితే సీమా హైదర్‌ పాక్‌ ఆర్మీ, ఆ దేశ గూఢచార సంస్థ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌(ఐఎస్‌ఐ) ఏజెంటా?.. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి. యూపీ యాంటీ టెర్రరిస్టు స్వాడ్‌(ఏటీఎస్‌) ఇదే కోణంలో విచారణ జరుపుతున్నది. అయితే ఈ విషయాలన్నీ పక్కన పెడితే వీరిద్దరు కలవడానికి పబ్జీ గేమ్ దోహద పడిందని చెప్పక తప్పదు. సోషల్ మీడియా వాడకంతో సరిహద్దు ప్రేమలు పుట్టుకు రావడం ట్రెండ్ గా మారింది.

Also Read: Crazy Combination: మరో మూవీకి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్, లోకేష్ కనగరాజ్ తో భారీ బడ్జెట్ మూవీ!