Site icon HashtagU Telugu

Lanka On Fire: లంక తగలబడిపోతోంది…ప్రధాని,మంత్రులు, ఎంపీల ఇళ్లకు నిప్పు..!!

Fire

Fire

శ్రీలంకలో పరిస్థితులు చేయిదాటిపోయాయి. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న లంకలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. లంగ ఇప్పుడు తగలబడిపోతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం తీవ్ర ఉద్రిక్తలు, హింసాత్మక ఘటనలకు దారి తీస్తున్నాయి. ఆగ్రహంతో చెలరేగిపోతున్న ప్రజలు…అధికార పార్టీకి చెందిన నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. పలువురు మంత్రులు, ఎంపీ ఇళ్లకు కూడా నిప్పు పెట్టారు. సోమవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి పదవికి మహింద రాజపక్సే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన మద్దతుదారులు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నవారిపై దాడి చేశారు. దీంతో హింసాత్మక ఘటనలకు దారి తీసింది.

రోడ్లపైకి వచ్చి జనాలు ఆందోళన చేస్తున్నారు. కురునాగళలోని మహింద్ర రాజపక్సే ఇంటిని ఆందోళనకారులు తగులబెట్టారు. మంత్రి కంచన విజేశేఖరా ఇంటికి, ఎంపీ అరుండిక ఫెర్నాండో ఇంటికి నిప్పు పెట్టారు ఆందోళనకారులు. ఎంపీ తిస్సాకుతియర్చికు చెందిన షాపింగ్ మాల్ ధ్వంసం చేశారు. కెగల్లులోని ఎంపి మహిపాల హెరాట్ ఇంటికి నిప్పటించారు. ఎంపీలు, మంత్రుల ఇళ్లకు నిప్పు పెట్టి కార్లను సైతం తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. హింస చెలరేగడంతో భయాందోళనకు గురైన పోలీసులు…స్టేషన్లున వదిలి పారిపోయారు. ఏ నిమిషమైనా అధ్యక్ష భవనాన్ని ముట్టడించే అవకాశం ఉండటంతో…సైన్యం అధ్యక్ష భవనాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.