Site icon HashtagU Telugu

TTD: శ్రీవారి సేవలో శ్రీలంక ప్రధాని

Srilanka pm

Srilanka pm

తిరుమల వేంకటేశ్వరుడికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. సామాన్యులు మొదలుకొని దేశ ప్రధానుల వరకు వెంకన్న దర్శనం కోసం తపిస్తుంటారు. రెండుమూడు రోజులు తిరుమల బస చేసి స్వామివారి సేవలో తరిస్తుంటారు. తాజాగా శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చారు. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు. గతంలో చాలాసార్లు రాజపక్స శ్రీవారిని దర్శనం చేసుకున్నారు.