ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎట్టకేలకు సన్ రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. వరుస పరాజయాల తర్వాత డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై ఘన విజయం సాధించింది. ఈ విజయంలో సన్ రైజర్స్ బౌలర్లు కీలక పాత్ర పోషించారు. హైదరాబాద్ బౌలర్లు సమష్టిగా రాణించి ప్రత్యర్థిని స్వల్ప స్కోర్‌కే పరిమితం చేశారు. మోయిన్ అలీ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 48 సూపర్ బ్యాటింగ్‌తో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయింది. మోయిన్ అలీకి అండగా అంబటి రాయుడు 27 బంతుల్లో 4 ఫోర్లతో 27 , రవీంద్ర జడేజా 15 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23 రాణించారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, నటరాజన్ రెండేసి వికెట్లు తీయగా.. మార్క్‌రమ్, మార్కో జాన్సెన్, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
155 పరుగుల లక్ష్య ఛేదనలో అభిషేక్ శర్మ , రాహుల్ త్రిపాఠి చెలరేగి ఆడారు. ఫలితంగా సన్ రైజర్స్ మరో 14 బంతులు ఉండగానే కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ విలియమ్సన్ 32 పరుగులు చేయగా.. అభిషేక్ శర్మ 50 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసాడు. తర్వాత రాహుల్ త్రిపాఠి కూడా ధాటిగా ఆడి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. చెన్నై బౌలర్లలో బ్రావో, ముఖేశ్ చౌదరీలకు తలో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో ఓటమితో డిఫెండింగ్ ఛాంపియన్ సీఎస్‌కే సీజన్‌లో వరుసగా నాలుగో ఓటమిని చవిచూసింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లోనూ చెన్నై ఏ మాత్రం స్థాయికి తగినట్టు ఆడలేక పోయింది. అటు కెప్టెన్ గా రవీంద్ర జడేజా మరోసారి పూర్తిగా విఫలం అయ్యాడు.
Photo Courtesy- Twitter
.@SunRisers win by 8 wickets to register their first win in #TATAIPL 2022.#CSKvSRH pic.twitter.com/aupL3iKv5v
— IndianPremierLeague (@IPL) April 9, 2022