Site icon HashtagU Telugu

42 Crore Phones : 42 కోట్ల ఫోన్లలో స్పై వేర్.. వ్యక్తిగత సమాచారం చోరీ

Internet Suspende

42 Crore Phones

42 Crore Phones : దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలో ఒక ప్రమాదకర స్పై వేర్ ఉందని వెల్లడైంది. 

దాని పేరే ‘స్పిన్ ఓకే’.. 

ఈవిషయాన్ని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) గుర్తించింది.   

గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్న 105 యాప్‌ల ద్వారా ఫోన్‌లలోకి ఈ స్పై వేర్  చొరబడుతోందని వెల్లడించింది. 

దీనిపై CERT-In ఒక అడ్వైజరీని రిలీజ్ చేసింది.

ఫోన్‌లో పదే పదే ఆటోమేటిక్ గా యాడ్స్ ఓపెన్ అయితే అనుమానించాలని సూచించింది.

‘స్పిన్ ఓకే’ స్పైవేర్‌ చాలా డేంజర్. ఇది మన ఫోన్ లోకి చొరబడిన తర్వాత ఈమెయిల్‌లు, టెక్స్ట్ మెసేజ్ ల సమాచారాన్ని దొంగిలిస్తుంది. ఫోన్ కెమెరాను ఉపయోగించి రికార్డులను చోరీ  చేస్తుంది. ఇంట్లో ఫోన్ ఎక్కడ ఉంచితే అక్కడ.. చుట్టూ జరుగుతున్న విషయాలను సీక్రెట్ గా వింటుంది. వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించే ఈ స్పైవేర్ ఇప్పటికే మన దేశంలోని 42 కోట్ల స్మార్ట్ ఫోన్లలోకి(42 Crore Phones) చేరిపోయింది. గూగుల్ ప్లే స్టోర్‌ (Google Play Store)లో ఉన్న 105 యాప్‌ల ద్వారా ఇది ఫోన్లకు సోకింది. కేంద్ర ఐటీ శాఖ వర్గాల సమాచారం ప్రకారం.. ‘స్పిన్ ఓకే’ స్పైవేర్‌ అత్యంత ప్రమాదకరం. ఇది కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా ఫోన్‌లోకి ప్రవేశించి జావాస్క్రిప్ట్ కోడ్ ను వాడుకొని తన యాక్టివిటీని నిర్వహిస్తుంది. ఫోన్‌లో ఉన్న డేటాను కాపీ చేసి, తెలియని రిమోట్ సర్వర్ కు ఆ సమాచారం పంపుతుంది. మన ఫోన్ నుంచి డిలీట్ అయిన ఫైల్స్ ను కూడా మనకు తెలియకుండానే రికవర్ చేస్తుంది. ఇది మన ఫోన్‌లో ఉన్న ఫైల్‌లలో కూడా మార్పులు చేయగలదు. మన ఫోన్ కెమెరాను ఆటోమేటిక్‌గా ఉపయోగించే కెపాసిటీ కూడా ‘స్పిన్ ఓకే’ స్పై వేర్ కు ఉంది.  ఈనేపథ్యంలో మనదేశ జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగుల ఫోన్ల నుంచి ‘స్పిన్ ఓకే’ స్పై వేర్ దొంగిలించకుండా చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. అనుమానాస్పద యాప్‌లను మొబైల్ ఫోన్ల నుంచి తొలగించాలని అన్ని మంత్రిత్వ శాఖల సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

ఏమిటా డేంజరస్ యాప్స్ ? 

బ్యాంక్ బింగో స్లాట్, జాక్‌పాట్ కింగ్, లక్కీ జాక్‌పాట్, బబుల్ కనెక్ట్, పిక్ ప్రో, ఇన్‌స్టాక్యాష్, గోల్డ్ మైనర్ నాణేలు, మ్యాచ్ ఫన్ 3D, స్టెప్ కౌంటర్: కీప్ ఫిట్, TT ట్యూబ్ షార్ట్ వీడియో, కాయిన్ వైబ్, క్యాసినో రాయల్, లక్కీ వరల్డ్ కప్, ఓహ్ క్యాష్, క్యాండీ గ్యాస్, మీమ్ గురు, పిక్స్ మానియా వంటి మొత్తం 105 యాప్‌లు అనుమానాస్పదంగా ఉన్నాయి. వీటి ద్వారానే కోట్లాది మంది ఫోన్లలోకి ‘స్పిన్ ఓకే’ స్పై వేర్ చేరి ఉంటుందని కేంద్ర ఐటీ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. ఫోన్‌లో పదేపదే ఆటోమేటిక్ గా యాడ్స్ ఓపెన్ అయినా  అనుమానించాలని ప్రజలకు సూచిస్తున్నాయి. అనుమానాస్పదంగా ఉన్న యాప్స్ ను ఫోన్ నుంచి అన్ ఇన్ స్టాల్ చేస్తే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని పేర్కొన్నాయి.  

Also read : Pegasus Spyware: పెగాసస్ స్పై వేర్‌ను.. చంద్ర‌బాబు కొనే ఉంటారు..?

సేఫ్టీ టిప్స్ ఇవీ..

  • ఆండ్రాయిడ్ ఫోన్‌లో యాంటీవైరస్, యాంటీ స్పైవేర్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.
  • ఏదైనా వెబ్‌సైట్ లేదా యాప్‌ లో ప్రకటనలపై క్లిక్ చేయొద్దు.
  • ఈ-మెయిల్, టెక్స్ట్  రూపంలో వచ్చే లింక్‌లపై క్లిక్ చేయొద్దు.  
  • Google Play Store నుంచి ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు, దాని రివ్యూను ఒకసారి చదవండి.
  • విశ్వసనీయత లేని వెబ్‌సైట్ నుంచి యాప్స్ ను డౌన్‌లోడ్ చేయొద్దు.  
  • ఆండ్రాయిడ్ ఫోన్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తూ ఉండండి.

Also read : Spyware On Phone: మీ ఫోన్ లో స్పై వేర్ అయితే లేదు కదా? ఇలా చెక్ చేసుకోండి!!

ఇలాంటి యాప్స్ లో స్పైవేర్‌ ఉంటుంది

‘స్పిన్ ఓకే’ స్పై వేర్ .. ఆన్‌లైన్ నగదు రివార్డ్‌లు, గేమ్‌లు, ఫిట్‌నెస్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్, ఇన్వెస్ట్‌మెంట్ యాప్ లలో ఉండే ఛాన్స్ ఉంది. నాయిస్ వీడియో ఎడిటర్, Zapaya, Biugo MV Bit, Crazy Drops, Tik, We Fly, Cash Join, Cash EM, Fizzo Novel వంటి యాప్స్ కు దూరంగా ఉండాలి. 

Exit mobile version