బీహార్‌లో మద్యం నిషేధం ఉన్నప్పటికీ అక్రమ మద్యం (Spurious liquor) విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. ఈ కారణంగానే విష మద్యం తాగి ప్రజలు మరణించిన ఉదంతాలు తెరపైకి వస్తున్నాయి. కల్తీ మద్యం (Spurious liquor) తాగి ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందిన తాజా కేసు ఛప్రా జిల్లాలో చోటుచేసుకుంది. అదే సమయంలో ఇద్దరు వ్యక్తుల పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారు. అక్కడ వారు కూడా మరణించినట్లు సమాచారం. మొత్తం ఏడుగురి మృతికి సంబంధించిన సమాచారం అందుతోంది. ఈ ఘటన ఇస్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఈ ఘటన ఇస్సాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డోయిలా గ్రామంలో జరిగింది. పోలీసులు విచారణలో నిమగ్నమై ఉన్నారు. సమాచారం అందుకున్న వైద్య ఆరోగ్యశాఖ ఓ బృందాన్ని గ్రామానికి పంపించింది. ఈ బృందం గ్రామంలోని ప్రజలకు వైద్యపరీక్షలు చేస్తోంది. అనుమానం వచ్చిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతులను డోయిలా గ్రామానికి చెందిన సంజయ్ సింగ్, బిచేంద్ర రాయ్, అమిత్ రంజన్‌లుగా గుర్తించారు. మష్రక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కునాల్ కుమార్ సింగ్, హరేంద్ర రామ్ మరణించినట్లు కూడా తెలుస్తోంది. ఈ ఘటనతో గ్రామంలో గందరగోళం నెలకొంది.
అతిగా మద్యం సేవించడం వల్ల అందరి పరిస్థితి విషమంగా మారిందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైద్యులు తెలిపారు. మొత్తం ఏడుగురు రోగులను ఆసుపత్రికి తీసుకురాగా.. వారిలో ఐదుగురు మరణించగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరికీ చికిత్స అందించగా వారు కూడా మరిణించినట్లు తెలుస్తోంది. మరోవైపు మృతుల బంధువులను విచారిస్తున్నట్లు ఇస్సాపూర్ పోలీస్ స్టేషన్‌లో తెలిపారు. ఈ వ్యక్తులు ఎక్కడి నుంచి మద్యం కొనుగోలు చేశారనే దానిపై కూడా ఆరా తీస్తున్నారు.
Also Read: Man Kills Father: దారుణం.. తండ్రిని హత్య చేసి 32 ముక్కలుగా నరికాడు
గ్రామంలోని ప్రజలకు వైద్యపరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, మరెవరూ మద్యం సేవించలేదని నిర్ధారించారు. అనుమానితులెవరైనా దొరికితే వారిని ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. పలు కోణాలలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మధుర డీఎస్పీ మాట్లాడుతూ.. మద్యం సేవించి అస్వస్థతకు గురైన గ్రామస్తుల కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిపారు.