Spicejet: కుప్పకూలిన షేర్లు.. జీతాలు ఇవ్వకుండా పైలెట్లను ఇంటికి పంపిన విమాన సంస్థ?

విమానయాన సంస్థ స్పైస్ జట్టులో ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ కంపెనీ షేర్ పై తీవ్ర

  • Written By:
  • Updated On - September 23, 2022 / 08:13 AM IST

విమానయాన సంస్థ స్పైస్ జట్టులో ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ కంపెనీ షేర్ పై తీవ్ర ప్రభావాలను చూపుతున్నాయి. కాగా ఇప్పటికే పలు టెక్నికల్ లోపాల వల్ల ఆ కంపెనీకి చెందిన విమానాలు ఎగరడానికి కష్టపడుతుండగా, డీజీసీఏ కంపెనీకి చెందిన 80% విమానాలను రద్దు చేసి సదర్ విమాన సంస్థ మరింత నిఘాను పెట్టింది. ఈ పరిస్థితులు విమానయాన సంస్థను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుండగా తాజాగా స్పైస్ జెట్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఈ విమానయాన సంస్థను మరింత కలిచి వేస్తోంది.

అదేమిటంటే..స్పైస్‌ జెట్ తన పైలట్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. జీతాలు ఇవ్వకుండానే 80 మంది పైలట్లను సెలవు పై ఇంటికి పంపేసింది. ఖర్చులను తగ్గించుకునేందుకు కంపెనీ చేపట్టిన తాత్కాలిక చర్యల్లో భాగంగా ఈ పైలట్లను ఇంటికి పంపేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇన్వెస్టర్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీంతో బుధవారం స్పైస్‌జెట్ షేర్లు ట్రేడింగ్ ప్రారంభంలోనే 3.5 శాతం మేర కుప్పకూలాయి. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లో స్పైస్‌జెట్ షేర్లు టాప్ 5 లూజర్లలో ఒకటిగా ఉన్నాయి.

కాగా ఇటీవల కాలంలో స్పైస్‌ జెట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కంపెనీ షేరు పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీంతో పాటు స్పైస్‌జెట్ విమానాల్లో టెక్నికల్ లోపాలు వార్తల్లో ప్రధానాంశంగా నిలుస్తున్నాయి. స్పైస్‌ జెట్ ఎయిర్‌ క్రాఫ్ట్‌లలో టెక్నికల్ లోపాలు ఉన్నాయనే కారణంతో 8 వారాలలో 50 శాతం మేర విమానాలను డీజీసీఏ రద్దు చేసింది. ఈ 8 వారాల పాటు స్పైస్‌ జెట్ ఎయిర్‌ లైన్ సంస్థ పై తాము అదనపు నిఘా పెట్టనున్నామని డీజీసీఏ తెలిపింది. స్పైస్‌జెట్ కంపెనీకి మొత్తంగా 90 ఎయిర్‌ క్రాఫ్ట్‌ లు ఉన్నాయి