Site icon HashtagU Telugu

SpiceJet Turbulence: ముంబై-దుర్గాపూర్ స్పైస్ జెట్ కు ప్రమాదం..40మంది ప్రయాణికులకు గాయాలు.!!

Boeing Lost

spicejet

ముంబై నుంచి పశ్చిమబెంగాల్ లోని దుర్గాపూర్ కు వెళ్తున్న స్పైస్ జెట్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మొత్తం 40మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో 12మందికి తీవ్రగాయాలయ్యాయి. కాగా ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. 189సీట్లున్న బోయింగ్ 737-800విమానంలో ఈ ఘటన జరిగినట్లు స్పైస్ జెట్ ప్రతినిధి తెలిపారు. విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కుదుపేసినట్లుగా ముందుకు దూసుకెళ్లిందని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారని..క్యాబిన్ లోని సామాను చాలామంది తలలపై పడి గాయాలయ్యాయని అధికారులు తెలిపారు.

ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 188మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఫోర్స్ అథారిటీ వర్గాలు తెలిపాయి. కొంతమంది ప్రయాణీకులకు తలకు గాయాలయ్యాయని…వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై స్పైస్ జెట్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.