శంషాబాద్ ఎయిర్ పోర్టులో స్పైస్ జెట్ విమానానికి ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానంలో పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణీకులు భయాందోళనకు గురయ్యారు. ఫ్లైట్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫ్లైట్ లో అర్థరాత్రి ల్యాండింగ్ ముందు సమస్య తలెత్తింది. గోవా నుంచి రాత్రి 9గంటలకు బయలుదేరిన విమానం …రాత్రి 11గంటలు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. అయితే ఫ్లైట్ గాల్లో ఉండగానే కాక్ పిట్ పొగలను గమనించాడు పైలెట్. ఈ పొగలు విమానం అంతటా వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ను అప్రమత్తం చేశాడు. దీంతో ఫ్లైట్ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఆ ఫ్లైట్ లో 86మంది ప్రయాణికులు ఉన్నారు. ఒక మహిళ అస్వస్థతకు గురయ్యారు. మిగతా వారంతా క్షేమంా ఉన్నారు.