Road Accident: షోలాపూర్‌లోని కరాడ్-పంధర్‌పూర్ హైవేపై వేగంగా వచ్చిన ట్రక్కు వారిపైకి దూసుకెళ్లడంతో ఐదుగురు మహిళా రైతులు నేలకూలగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రోజు సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఏడుగురు మహిళా వ్యవసాయ కార్మికులు తమ రోజు పనిని ముగించుకుని సంగోలా ప్రాంతంలోని ఫట్‌ఫాల్ గ్రామంలోని తమ ఇళ్లకు తిరిగి వస్తుండగా ఈ దుర్ఘటన సంభవించిందని ఇన్‌స్పెక్టర్ భీమ్‌రావ్ ఖండాలే తెలిపారు. ఫట్‌ఫాల్‌కు వెళ్లే బస్సు కోసం మహిళలు రోడ్డు పక్కన వేచి ఉండగా బొగ్గుతో వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా హైవేపై వేగంగా వచ్చి బండ్‌గర్‌వాడి గ్రామం సమీపంలో వారిపైకి దూసుకెళ్లి కొంత దూరంలో ఆగిపోయింది.ఆ మహిళా రైతుల ఆర్తనాదాలు విన్న ఇతర రైతులు, గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని సంగోల పోలీసులకు సమాచారం అందించారు.వారు ట్రక్ డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు, గాయపడిన మహిళలను పండర్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించడానికి అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.
ట్రక్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగ్రహించిన గ్రామస్తులు పెద్ద సంఖ్యలో ప్రమాద స్థలం వద్ద గుమిగూడారని ఖండాలే తెలిపారు.
Also Read: Govt Schemes Name Change : ఇక పథకాలకు ‘జగన్’ పేరు ఉండదు..