Animal Holiday: ఇకపై జంతువులకు కూడా ఒక రోజు సెలవు.. ఎక్కడంటే?

మామూలుగా మనం ఎటువంటి పని చేసిన ఏదైనా జాబ్ చేసిన కూడా వారం అంతా పనిచేసే ఒక రోజు రెస్టు తీసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని కంపెనీలు వీక్లీ వన్స్

  • Written By:
  • Publish Date - August 7, 2023 / 08:00 PM IST

మామూలుగా మనం ఎటువంటి పని చేసిన ఏదైనా జాబ్ చేసిన కూడా వారం అంతా పనిచేసే ఒక రోజు రెస్టు తీసుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని కంపెనీలు వీక్లీ వన్స్ సెలవు ప్రకటిస్తే కొన్ని కంపెనీలు నెలకు రెండు మూడు లీవులు అంటూ ప్రకటిస్తూ ఉంటాయి. అలా వారంలో ఏదో ఒక రోజు సెలవు తీసుకోవడం కామన్. ఎక్కడో వారానికి ఐదు రోజులు, ఎక్కడో 6 రోజులు పని చేయాల్సి ఉంటుంది. ఇండియాలో కూడా వారానికి నాలుగు రోజులు పని చేయాలనే చర్చ మొదలైంది. మనుష్యులకు ఈ హక్కులన్నీ లభిస్తాయి కానీ జంతువులకు అటువంటి సుఖాలు ఏవి లభించవు.

వారంలో ఒక రోజు జంతువులకు సెలవు ఇచ్చే ప్రదేశం ఉందని మీకు తెలుసా, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. అక్కడ జంతువులకు ఆ రోజు ఏం పని చెప్పరు. వ్యవసాయం లేదా ఇతర పనిలో ఉపయోగించే పెంపుడు జంతువులకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది. పూర్తి వివరాల్లోకి.. జార్ఖండ్‌లోని లతేహర్‌లో ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ ఆవు, గేదె, ఎద్దు వంటి ఇతర జంతువులు కూడా మనుషుల్లాగే పనిచేస్తాయి. రైతులు, ఇతర కుటుంబాల ఆదాయాన్ని పెంచడంలో సహాయపడతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు.

సామాన్యుల మాదిరిగానే ఈ జంతువులకు కూడా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వడం ఈ రోజున ఎటువంటి పని జరగకపోవడం ఇదే కారణం. లతేహర్ గ్రామం కాకుండా, హర్ఖా, ముంగర్, లాల్‌గాడి, పక్రార్‌లలో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందిస్తున్నారు. ఒక్కొక్క నేటిజెన్స్ వారి వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.