Indigo Issue: దివ్యాంగ బాలుడిని ఫ్లైట్ లోకి ఎక్కించుకుని ఇండిగో సిబ్బంది…మండిపడుతున్న నెటిజన్లు..!!

ఇండిగో సిబ్బంది..దివ్యాంగ చిన్నారిపై ప్రవర్తించిన తీరు ఆగ్రహం తెప్పించేలా ఉంది.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 05:04 AM IST

ఇండిగో సిబ్బంది..దివ్యాంగ చిన్నారిపై ప్రవర్తించిన తీరు ఆగ్రహం తెప్పించేలా ఉంది. హైదరాబాద్ వెళ్లేందుకు గత శనివారం దివ్యాంగ చిన్నారితో ఓ కుటుంబం రాంచీ ఎయిర్ పోర్టుకు వచ్చింది. అయితే ఆ దివ్యాంగ బాలుడు విమానం ఎక్కేందుకు ఇండిగో సిబ్బంది నిరాకరించారు. బాలుడు భయాందోళనతో ఉన్నాడని…దాని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని విమానం ఎక్కనివ్వలేదు. దీంతో ఆ బాలుడి పేరెంట్స్ ప్రయాణాన్ని విరమించుకున్నారు. ఈ ఘటనను గమనించిన మనీషా గుప్తా అనే తోటి ప్రయాణికురాలు తన ఫేస్ బుక్ పోస్టు చేశారు.

చిన్నారిని అడ్డుకున్న ఇండిగో సిబ్బంది…ఆ బాలుడి తల్లిదండ్రులతో వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు. అయినా కూడా సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఇండిగో సంస్థ తీరుపై మండిపడుతున్నారు. ఈ ఘటనపై విమానయాన సంస్థ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా తీవ్రంగా స్పందించారు. సహించరానిదని దర్యాప్తు జరిపి కారుకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చిరించారు. తానే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షిస్తానని చెప్పారు.