గుజరాత్‌లో 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేకకోర్టు. అహ్మదాబాద్‌లో 18 చోట్ల ఈ సీరియల్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. ఈ వరుస బాంబు బ్లాస్ట్ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు, వారిలో 38 మందిని కీలక దోషులుగా ప్రకటించి, వారికి మరణశిక్ష విధించింది. మిగతా 11 మందికి జీవిత ఖైదు విధిస్తూ ప్రత్యేకకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మొత్తం 78 మంది నిందితుల్లో 49 మందిని పలు నేరాల కింద దోషులుగా ప్రకటిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి ఏఆర్ పటేల్ తుది తీర్పును వెలువరించారు.
Bomb Blast Case: అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు.. 38 మందికి మరణ శిక్ష..!
గుజరాత్‌లో 2008 అహ్మదాబాద్ సీరియల్ బాంబ్ బ్లాస్ట్ కేసులో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న 38 మందికి మరణ శిక్ష విధించింది ప్రత్యేకకోర్టు. అహ్మదాబాద్‌లో 18 చోట్ల ఈ సీరియల్ బ్లాస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసు పై దాదాపు 13 ఏళ్ళ తర్వాత కోర్టు తీర్పు చెప్పింది. ఈ వరుస బాంబు బ్లాస్ట్ కేసులో మొత్తం 49 మందిని దోషులుగా ప్రకటించిన ప్రత్యేక కోర్టు, వారిలో 38 […]

Ahmedabad Serial Blast Case
Last Updated: 18 Feb 2022, 01:08 PM IST