Jeevan Reddy: ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ తో మాట్లాడుతూ: జీవన్ రెడ్డి

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 10:06 AM IST

Jeevan Reddy: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించడానికి తానే భాధ్యత తీసుకుంటానని మాజీమంత్రి, కాంగ్రేస్ సీనియర్ నాయకులు, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు హామీ ఇచ్చారు. జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడారు.

ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మీ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కారం చేసే విధంగా పాటుపడుతానని చెప్పారు. గ్రామాల్లో వ్యవసాయ, కూలీలకు ఉపాధి కల్పించడం కోసం ఆనాడు కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం సోనియాగాంధీ నాయకత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూపొందించిందని పేర్కొన్నారు. దీంతో గ్రామాల్లోకూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వారి డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని జీవన్ రెడ్డి ఫీల్డ్ అసిస్టెంట్ల కు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ సంఘం అధ్యక్షుడు గడ్డం రమేష్ , జిల్లా కార్యవర్గ సభ్యులు గౌడికర్ శ్రీనివాస్, సదానందం, మామిడాల మల్లేశం, పడిగల లక్ష్మణ్ ,కోలపాక రాజు, గోనెపల్లి మహేష్ ,రాచర్ల రమేష్, మేడిపల్లి గంగాధర్, జిల్లాలోని అన్ని మండలాల ఫీల్డ్ అసిస్టెంట్స్ పాల్గొన్నారు.