Site icon HashtagU Telugu

Menstual Leave: ఇకపై ఆ దేశంలో మహిళలకు నెలకు మూడు రోజుల పీరియడ్ లీవ్…

Menstrual

Menstrual

స్పెయిన్‌లో మహిళల పీరియడ్స్ సమయంలో ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలా మూడు అదనపు సెలవులను పొందవచ్చని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం తీసుకున్న మొదటి యూరోపియన్ దేశం స్పెయిన్ కావడం విశేషం. పీరియడ్స్ పెయిన్ కోసం ఇచ్చే లీవ్ పరిమితి నెలకు 3 రోజులుగా నిర్ణయించారు. స్పెయిన్ ప్రభుత్వం వచ్చే వారం నుంచి దేశంలో ఈ సంస్కరణలను అమలు చేయనుంది.

మంగళవారం స్పెయిన్ తదుపరి క్యాబినెట్ సమావేశంలో ఆమోదించబడే సంస్కరణ ప్యాకేజీలో భాగంగా, పాఠశాలలు అవసరమైన బాలికలకు ‘శానిటరీ ప్యాడ్‌లు’ అందించాల్సిందిగా అధికారులను ఆదేశించింది.

ఇప్పటి వరకు కొన్ని దేశాల్లో మాత్రమే పీరియడ్స్ సమయంలో సెలవులు ఇస్తున్నారు. జపాన్, దక్షిణ కొరియా, ఇండోనేషియా, జాంబియా దేశాలు రుతుక్రమ సెలవులు అందిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో స్పెయిన్ కూడా చేరింది.

అదే సమయంలో, స్పెయిన్ మార్చి 3 న మహిళల ఆరోగ్యానికి హామీ ఇచ్చే ప్యాకేజీని ప్రకటించింది. అబార్షన్లు చేయించుకున్న మహిళలకు సెలవు మంజూరు చేయడంతో సహా పలు సంస్కరణలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది.

ముఖ్యంగా పీరియడ్స్ నొప్పితో బాధపడే మహిళలకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో స్పెయిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చాలా మంది మహిళలు బహిష్టు సమయంలో రెస్ట్ తీసుకోకపోవడం వల్ల ‘డిస్మెనోరియా’ అనే ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు.

అదే సమయంలో, స్పెయిన్‌లోని శానిటరీ ప్యాడ్‌లపై పన్నును ఎత్తివేసింది. అలాగే సామాజికంగా అణగారిన మహిళలకు వీటిని ఉచితంగా అందజేయనున్నారు. వ్యభిచారం కోసం మహిళల అక్రమ రవాణాను నిరోధించే చట్టాన్ని కూడా స్పెయిన్ పరిశీలిస్తోంది.