సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఆయన క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ములాయం సింగ్ యాదవ్ కోసం అవసరమైతే కిడ్నీ ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పార్టీ నేత అజయ్ యాదవ్ ప్రకటించారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారణాసిలోని పలు ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు. ములాయం చికిత్స పొందుతున్న గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి ఎవరూ రావొద్దని సమాజ్ వాదీ పార్టీ కోరింది. ములాయంకు ప్రస్తుతం క్రిటికల్ కేర్ యూనిట్‌లో చికిత్స కొనసాగుతోందని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని పేర్కొంది. ములాయం ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తామని పార్టీ తెలిపింది.
SP Chief Mulayam Singh : ములాయం సింగ్ యాదవ్‌కు కిడ్నీ ఇచ్చేందకు సిద్ధమైన ఎస్పీ నేత
సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది. అనారోగ్యంతో..

Mulayam
Last Updated: 04 Oct 2022, 08:21 AM IST