Weather Updates : మరో మూడు రోజులు భారీ వర్ష సూచన.. ఎక్కడెక్కడంటే..?

Weather Updates : గతేడాదితో పోల్చితే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి.

Published By: HashtagU Telugu Desk
Southwest Monsoon Andhra Pradesh Telangana Rains Alert Imd

Weather Updates : గతేడాదితో పోల్చితే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ , తెలంగాణ రాష్ట్రాల్లో ఈ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. దీంతో రైతులు సకాలంలో వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పొలాలను సిద్ధం చేసి విత్తనాలు నాటడం ప్రారంభించారు. అంతేకాదు, పలు ప్రాంతాల్లో ఆరుద్ర పురుగులు (రైతు నేస్తాలు) కూడా కనిపించడం ప్రారంభమైంది. ఇది రైతుల ముఖాల్లో ఆనందం రేపుతోంది. ఇదిలా ఉండగా, రెండు రోజుల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ముంచెత్తిన సంగతి తెలిసిందే. ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడిన ఘటనల్లో ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మరోసారి అప్రమత్తం చేసింది.

Railway Good News : ఇకపై రైలు ప్రయాణికులు చర్లపల్లి కి వెళ్లనవసరం లేదు

వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో చెట్ల కిందకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. రైతులు పంట పొలాలకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులు గమనించాలంటూ సూచనలు చేశారు.

Raja Saab Leak : ‘రాజా సాబ్’ ప్రభాస్ లుక్ లీక్..ట్రెండ్ సెట్ చేస్తున్న ఫ్యాన్స్

  Last Updated: 01 Jun 2025, 05:35 PM IST