Site icon HashtagU Telugu

Gujarat : పారాగ్లైడింగ్ చేస్తూ జారిప‌డిన వ్య‌క్తి.. గుజ‌రాత్‌లోని మెహ‌సానాలో ఘ‌ట‌న‌

Deaths

Deaths

దక్షిణ కొరియాకు చెందిన 50 ఏళ్ల వ్యక్తి గుజరాత్‌లోని మెహసానాలో పారాగ్లైడింగ్ చేస్తూ పడి చనిపోయాడు. గుజరాత్‌లోని మెహసానా జిల్లా కడి సమీపంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. షిన్ బైయోన్ మూన్ అనే వ్య‌క్తి పారాగ్లైడింగ్ సమయంలో సరిగ్గా ఓపెన్ కాక‌పోవ‌డంతో 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని స్నేహితులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. షిన్ వడోదర పర్యటనలో ఉన్నాడని.. అత‌ను త‌న కొరియన్ స్నేహితుడు శనివారం సాయంత్రం కడి పట్టణానికి సమీపంలోని విసత్‌పురా గ్రామంలో పారాగ్లైడింగ్‌లో ఉన్న వారి పరిచయస్తులను సందర్శించార‌ని కడి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నికుంజ్ పటేల్ తెలిపారు. కడి పోలీస్ స్టేషన్‌లో ప్రమాద మరణం కేసు నమోదు చేశామ‌ని..వడోదరలోని మృతుడి బంధువులు స్నేహితులకు, కొరియన్ ఎంబసీకి సంఘటన గురించి సమాచారం ఇచ్చామ‌ని పోలీసులు తెలిపారు.