Pawan Kalyan : సౌత్ కోస్ట్ రైల్వే అభివృద్ధికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు జనరల్ మేనేజర్‌గా సందీప్ మథూర్‌ను నియమిస్తూ రైల్వే బోర్డు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు ఢిల్లీలో రైల్వే సిగ్నల్ ఆధునికీకరణ ప్రాజెక్టుకు నాయకత్వం వహించిన సందీప్ మథూర్, ఇప్పుడు సౌత్ కోస్ట్ రైల్వే బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విటర్) వేదికగా స్పందించారు.
Health Tips : చదువు మీద దృష్టి పెరగాలా..? ఈ అమ్మమ్మ ఔషధం తప్పక ట్రై చేయండి
సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌కు జీఎం నియామకం రాష్ట్ర అభివృద్ధిలో గణనీయమైన ముందడుగు అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చినట్లు పేర్కొన్నారు. సందీప్ మథూర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, సంబంధిత కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
ఇక రైల్వే కార్యకలాపాలకు వేగవంతమైన పురోగతికి ఇది మార్గం అయిందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నిర్ణయం రాష్ట్ర ప్రజల ఆశలను ప్రతిబింబిస్తుందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వ చొరవతో దక్షిణ కోస్తా రైల్వే అభివృద్ధిలో కీలక మలుపు తిరిగిందని ఆయన అన్నారు.
Elon Musk : ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దుపై ట్రంప్ హెచ్చరిక.. మస్క్ ఘాటు స్పందన