Site icon HashtagU Telugu

Trains Cancelled: 34 ఎమ్ఎమ్‌టీఎస్ రైళ్లను రద్దు చేసిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే

MMTS Trains

MMTS Trains

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే ఆదివారం హైదరాబాద్‌లో 34 రైళ్లను రద్దు చేసింది. నిర్వహణ కార్యకలాపాల కారణంగా రద్దు చేసిన‌ట్లు అధికారులు తెలిపారు లింగంపల్లి-హైదరాబాద్ మధ్య తొమ్మిది సర్వీసులు, హైదరాబాద్-లింగంపల్లి మధ్య తొమ్మిది సర్వీసులను రద్దు చేశారు. ఫలక్‌నుమా-లింగంపల్లి మధ్య ఏడు సర్వీసులను, లింగంపల్లి-ఫలక్‌నుమా మధ్య ఏడు సర్వీసులను కూడా అధికారులు రద్దు చేశారు.

సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒక సర్వీసు, సికింద్రాబాద్-లింగంపల్లి మధ్య ఒక సర్వీసు కూడా రద్దు చేయబడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ MMTS సేవల రద్దు దృష్ట్యా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది, కేశవగిరి, బోరబండ మ‌ధ్య 54 బస్సు సర్వీసులు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. సికింద్రాబాద్, హైటెక్ సిటీ మధ్య, సికింద్రాబాద్, బోరబండ మధ్య 16, CBS, పటాన్ చెరు మధ్య 108, సికింద్రాబాద్ ప‌టాన్‌చెరు మధ్య 84 బ‌స్సులు న‌డ‌ప‌నున్న‌ట్లు అధికారులు తెలిపారు.