David Miller Daughter: స్టార్ క్రికెట‌ర్ కూతురు మృతి..!

భారత్‌లో పర్యటిస్తున్న‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మిల్లర్‌ దుఃఖం కొండెక్కింది.

Published By: HashtagU Telugu Desk
Miller Daughter Imresizer

Miller Daughter Imresizer

భారత్‌లో పర్యటిస్తున్న‌ దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు స్టార్‌ ప్లేయర్‌ డేవిడ్‌ మిల్లర్‌ దుఃఖం కొండెక్కింది. మిల్లర్ కుమార్తె మరణించింది. సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకోవడం ద్వారా ఈ విష‌యం గురించి తెలియజేశాడు. అయితే.. ఈ పోస్ట్‌లో ఏదీ స్పష్టంగా వ్రాయలేదు. ఒక చిన్న వీడియోతో పాటు, మిల్ల‌ర్‌ ఇలా వ్రాశాడు. ‘RIP my dear Princess, love will always be there! అని రాశాడు. క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న మిల్ల‌ర్ కూతురు ప్రాణాలు కోల్పోయింది. పాప‌తో గడిపిన క్ష‌ణాల‌ను గుర్తు చేసుకుంటూ ఎమోష‌న‌ల్ వీడియో షేర్ చేశాడు.

డేవిడ్ మిల్లర్ మూడు T20లు, మూడు ODI సిరీస్‌ల కోసం భారత పర్యటనకు వచ్చాడు. ఈ దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ భారత్‌పై అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో అజేయంగా 106 పరుగులు చేశాడు. ఇది కాకుండా.. అతను భారత్‌తో జరిగిన మొదటి ODIలో అజేయంగా 75 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా.. భారత్‌పై విజయాన్ని నమోదు చేసి సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించిన విషయం తెలిసిందే.

మిల్లర్ దక్షిణాఫ్రికా తరఫున 147 వన్డేలు, 107 టీ20లు ఆడాడు. ODI క్రికెట్‌లో అతను 5 సెంచరీలు, 18 అర్ధ‌ సెంచరీలతో సహా 41.54 సగటుతో 3614 పరుగులు చేశాడు. ఇది కాకుండా టీ20లో 2069 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని పేరిట రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మిల్లర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా ఆడాడు. ఐపీఎల్ 2022లో అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు 3 కోట్ల బిడ్‌తో కొనుగోలు చేసింది.

  Last Updated: 09 Oct 2022, 12:13 AM IST