Site icon HashtagU Telugu

SA Tour: జూన్ లో భారత పర్యటనకు సౌతాఫ్రికా

Team India

Team India

స్వదేశంలో జరగనున్న ఐపీఎల్​ 2022 సీజన్​ ముగిశాక జూన్​లో భారత పర్యటనకు దక్షిణాఫ్రికా జట్టు రానుంది. ఈ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియాతో 5 టీ20 మ్యాచ్​ల సిరీస్ ఆడనుంది. మార్చి 26 నుంచి మే 29 వరకు ముంబై, పూణేలలో ఐపీఎల్‌ జరగనుంది. ఈ మెగా టోర్నీ ముగిసిన 10 రోజుల వ్యవధిలోనే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య జూన్ 6 నుంచి 19 వరకు పొట్టి సిరీస్​ జరగనుండగా.. కటక్​, విశాఖపట్నం ​, ఢిల్లీ, రాజ్​కోట్​, చెన్నైలో ఈ మ్యాచులు జరుగనున్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్‌ ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్ (ఎఫ్‌టీపీ)లో భాగమని బీసీసీఐ తెలిపింది. ఇక ఇటీవల దక్షిణాఫ్రికా చేతిలో వన్డే, టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా దారుణ ఓటమి పాలైంది. దీంతో స్వదేశంలో ఓటమికి టీమిండియా దెబ్బకి దెబ్బ తీయాలని అభిమానులు కోరుకుంటున్నారు..

అయితే ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమ్​ఇండియా ఇంగ్లండ్‌ టూర్ కు వెళ్లనుంది. గతేడాది వాయిదా పడిన నాలుగో టెస్టును టీమిండియా ఇంగ్లాండ్ తో ఆడనుంది. ఆ తర్వాత టీమిండియా.. ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. మలాహిడ్‌ వేదికగా ఈ ఏడాది జూన్‌ 26,28 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌కు టీమిండియా సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది.. టీమిండియా చివరసారిగా 2018లో ఐర్లాండ్‌లో పర్యటించింది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20ల సిరీస్‌ను 2-0 కైవసం చేసుకుంది.