Site icon HashtagU Telugu

SA Board: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు సఫారీ క్రికెట్ బోర్డు షాక్

south africa ODI

south africa ODI

ఐపీఎల్ 15వ సీజన్ కి ముందు ఫ్రాంచైజీలకు కొత్త సమస్య వచ్చి పడింది. బంగ్లాదేశ్ తో జరిగే వన్డే సిరీస్ కోసం దక్షిణాఫ్రికా జట్టును ఎంపిక చేయగా..పలువురు స్టార్ ప్లేయర్స్ కూడా చోటు దక్కంచుకున్నారు. దీంతో ఆ ప్లేయర్స్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ లకు దూరం కానున్నారు. ఈ నేపద్యంలో ఆయా టీంలు ప్రస్తుతం ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాయి. ఈ జట్టులో క్వింటన్ డి కాక్, మార్కో యాన్సన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్గిడి, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబాడ, రాసి వాన్ డెర్ డుసాన్ కూడా చోటు దక్కించుకున్నారు. ఈ ఆటగాళ్లందరూ ఐపీఎల్ జట్లలో ఉండడంతో ఫ్రాంచైజీ లకు టెన్షన్ మొదలైంది.

బంగ్లాదేశ్ , దక్షిణాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్ మార్చి 18 నుంచి 23 వరకు జరగనుంది. అదే సమయంలో, ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభంకానుంది. ఇటువంటి పరిస్థితిలో రబాడ, డికాక్ వంటి ఆటగాళ్లు ఈ టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్ ఆడలేకపోవచ్చు. ఎందుకంటే విదేశీ ఆటగాళ్లకు బీసీసీఐ క్వారంటిన్ రూల్స్ ప్రకారం అయిదు రోజుల పాటు ఐసోలేషన్ లో ఉండాలి. ఈ సీరీస్ ముగిసిన వెంటనే వీరంతా భారత్ కు చేరుకున్నా తొలి మ్యాచ్ ఆడే అవకాశం లేదు. దీంతో ఐపీఎల్ టీమ్స్ ఇప్పుడు బీసీసీఐ జోక్యాన్ని కోరుతున్నాయి.

ఇదిలా ఉంటే జాతీయ జట్టు కోసం వన్డే సిరీస్‌లో ఆడాలనుకుంటున్నారా లేదా ఐపీఎల్‌లో ఆడతారా అనే నిర్ణయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఆటగాళ్లకే వదిలేసింది. దీనిపై సదరు 8 మంది ఆటగాళ్లు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దక్షిణాఫ్రికా టెస్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కూడా జాతీయ జట్టుకు ఆడాలని ఆటగాళ్లను కోరాడు. తాజా పరిణామాలతో బీసీసీఐ దక్షిణాఫ్రికా బోర్డుతో చర్చించే అవకాశం కనిపిస్తోంది.

Exit mobile version