Site icon HashtagU Telugu

Sourav Ganguly : బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ అధ్య‌క్ష బ‌రిలో గంగూలీ

Sourav Ganguly

Saurav Ganguly

క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ అధ్యక్ష పదవికి ఇండియా టీమ్ మాజీ కెప్టెన్ సౌర‌వ్‌ గంగూలీ పోటీ చేయనున్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా రెండవసారి అవకాశం రాక‌పోవ‌డంతో గంగూలీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. గంగూలీ తాను CAB అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న‌ట్లు ధృవీకరించారు. అక్టోబర్ 31న అసోసియేష‌న్‌ ఎన్నికలు జరగనున్నాయి. బెంగాల్ క్రికెట్ అసోసియేష‌న్ ఎన్నికల సమయంలో ఎన్నికైతే, CAB అధ్యక్షుడిగా గంగూలీ రెండవసారి ఎన్నికవుతారు. బీసీసీఐకి వెళ్లే ముందు 2015 నుంచి 2019 వరకు అధ్యక్షుడిగా ఉన్నారు,