Site icon HashtagU Telugu

Sonu Sood : మేజర్లా…మైనర్లా కాదు…శిక్షపడాల్సిందే…సోసుసూద్ సంచలన వ్యాఖ్యలు..!!

హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ సంఘటనపై బాలీవుడ్ నటుడు సోనుసూద్ స్పందించారు. ఈ ఘటనను న్యూస్ లో చూసి షాక్ అయ్యాను అన్నారు. ఇది చాలా పెద్ద క్రైం అన్నారు. చేసింది మైనర్ ఆ…మేజర్ ఆ కాదు..ఎలాంటి క్రైం చేశారు అనేదే చూడాలి. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలి సోనుసూద్ డిమాండ్ చేశారు. నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇలాంటి ఘటనలకు పబ్స్ కారణం అవుతున్నాయనేది చాలా తప్పు..గ్రామీణ ప్రాంతాల్లో కూడా మైనర్ అమ్మాయిలు, మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. మనం ఆలోచించే పద్దతిలోఉంటుందన్నారు. పొట్టి పొట్టి బట్టలు వేసుకున్నారు అంటున్నారు కానీ…మనం చూసే విధానం తప్పుగా ఉంటే…చెడు ఆలోచనలే వస్తాయని ఆగ్రహించారు సోనుసూద్. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని సోనుసూద్ కోరారు.

 

Exit mobile version