Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాదం బాధిత కుటుంబాలను ఆదుకుంటా: సోనూసూద్

విలన్ గా ప్రేక్షకుల్ని బయపెట్టినా.. తన మానవతా దృక్పధంతో పేదలకు ఆసరాగా నిలుస్తుంటాడు నటుడు సోనూసూద్. సోనూసూద్ అంటే కరోనాకి ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవచ్చు

Odisha Train Accident: విలన్ గా ప్రేక్షకుల్ని బయపెట్టినా.. తన మానవతా దృక్పధంతో పేదలకు ఆసరాగా నిలుస్తుంటాడు నటుడు సోనూసూద్. సోనూసూద్ అంటే కరోనాకి ముందు, కరోనా తరువాత అని చెప్పుకోవచ్చు. కరోనాకి ముందు ఆయన కేవలం విలక్షణ నటుడు మాత్రమే. కరోనా సమయంలో సోనూసూద్ పేదలకు దైవంగా మారాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్నవారికి చేయి అందించాడు. ప్రభుత్వం కూడా చేయని కార్యక్రమాలను సోనూసూద్ చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో రక్త సంబంధీకుల్ని కోల్పోయిన బాధిత కుటుంబాలను ఆదుకునే బాధ్యతను సోనూసూద్ నెత్తినేసుకున్నాడు. ఈ సందర్భంగా రైలు ప్రమాదంలో కుటుంబీకులను కోల్పోయిన బాధితుల సహాయం కోసం హెల్ప్ లైన్ ఫోన్ నంబర్ (9967567520) కి మెసేజ్ చేయాల్సిందిగా కోరారు సోనూసూద్. జూన్ 3 న ఒడిశా రైలు ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారి కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తూ సోనూ సూద్ ట్వీట్ చేశారు. ఒడిశా రైలు దుర్ఘటనలో కుటుంబాలను కోల్పోయిన బాధితులకు వారి జీవితాలను పునర్నిర్మించుకోవడానికి సహాయం చేస్తున్నాను అని ట్వీట్ చేశాడు. ఒడిశా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన నటుడిని అభిమానులు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు.

Read More: Dangerous Bacteria : ప్రాణాంతక బ్యాక్టీరియా వెలుగులోకి.. మరణాల రేటు 50%