Site icon HashtagU Telugu

MLC Kavitha: సామాజిక సేవలో ఎమ్మెల్సీ కవిత కుమారులు

Mlc Kavitha

Mlc Kavitha

MLC Kavitha:  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకంట్ల కవిత కుమారులు ఆదిత్య, ఆర్యా చిన్న వయస్సులోనే పెద్ద మనస్సును చాటుకున్నారు. సమాజ సేవ కోసం ఇటీవల ఆదిత్య, ఆర్యా కలిసి మొదలుపెట్టిన సినర్జీ ఆఫ్ మైండ్స్ (ఎస్ఓఎం) ఫౌండేషన్ ద్వారా ఆడబిడ్డల చదవుకు చేయుతనిచ్చారు. హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ మహిళా కాలేజీలో అడ్మిషన్ లభించిన ఆర్థికంగా వెనుకబడిన 10 మంది మహిళా విద్యార్థులకు ఫౌండేషన్ నుంచి స్కాలర్ షిప్ లను అందజేశారు. 10 మంది విద్యార్థుల్లో ఆరుగురు అండర్ గ్రాడ్యుయేట్, ముగ్గురు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఉన్నారు. ఈ మేరకు కాలేజీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, కాలేజీ ప్రతినిధుల సమక్షంలో విద్యార్థులకు స్కాలర్ షిప్ ను ఆదిత్యా, ఆర్యా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… మహిళా సాధికారతకు తాము ఎప్పుడూ మద్ధతిస్తుంటామని తెలిపారు. తన కుమారులు ఇద్దరు సమాజ సేవ కోసం ఫౌండేషన్ ను స్థాపించి విద్యార్థులకు చేయుతనందించడం సంతోషంగా ఉందన్నారు. చిన్న వయస్సుల్లోనే వాళ్ళు గొప్పగా ఆలోచించడం తల్లిగా తాను గర్వపడుతున్నానని చెప్పారు. భవిష్యత్తులోనూ ఫౌండేషన్ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. స్కాలర్ షిప్ అందుకున్న విద్యార్థులకు అభినందనలు తెలిపిన కవిత… మంచి చదువులో బాగా రాణించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు.

Exit mobile version