ఇటీవల జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ ఓల్డ్ పార్టీగా పేరున్న కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. ఎవరూ ఊహించని విధంగా ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశమైంది. అయితే పార్టీ పెద్దలంతా సోనియా నాయకత్వానే సమర్థించారు. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఓటమిపై రాష్ట్ర నాయకులకు వార్నింగ్ ఇచ్చారు. పార్టీ సిద్ధాంతం కోసం కాకుండా వ్యక్తిగత ఇమేజ్ కోసం పనిచేసే నాయకులకు ఇకపై కాంగ్రెస్ లో స్థానం కల్పించబడదు అని, ప్రజల ఆకాంక్ష మేరకు కఠిన నిర్ణయాలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
కాంగ్రెస్ గెలవడంలో ప్రస్తుతం ఒడిపోవచ్చేమో కానీ ప్రయత్నించడంలో మాత్రం ఎప్పటికి ఒడిపోదు. ప్రజల పక్షాన ఇంకొంచెం మొండిగా పోరాడుతుందని కార్యకర్తల్లో ధైర్యం నింపారు. దేశ ప్రజలతో కలిసి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని, దేశ ప్రజలతో కలిసి ఆ స్వేచ్ఛను కాపాడుకుంటామని సోనియాగాంధీ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. పార్టీకోసం పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి లేదంటే, కఠిన చర్యలు ఉంటాయని సోనియాగాంధీ స్పష్టం చేశారు.