Site icon HashtagU Telugu

Delhi: గంగారామ్ ఆసుపత్రిలో చేరిన సోనియాగాంధీ…!!

Sonia Gandhi

Sonia Gandhi Congress

ఈమధ్యే కోవిడ్ బారినపడిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ హాస్పిటల్లో చేరారు. జూన్ 2న సోనియాగాంధీకి కోవిడ్ పాజిటివ్ అని వెల్లడైంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణకు సోనియాగాంధీ హాజరు కావాల్సి ఉంది. ఈలోగా కోవిడ్ కారణంగా సోనియా ఇంటికే పరిమితమయ్యారు. అయితే కోవిడ్ సంబంధిత సమస్యలతో ఆమె ఇవాళ ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

కాగా ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని…వైద్యులు పరిస్థితిని పరిశీలిస్తున్నందున సోనియా ఆసుపత్రిలోనే ఉంటారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వెల్లడించారు. సోనియా ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ మెసేజ్ లు పంపిస్తున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.