Site icon HashtagU Telugu

Telangana: నాన్న నేను నీతోనే.. మ‌ర‌ణంలోను వీడ‌ని తండ్రికొడుకుల బంధం

Suicide

Suicide

అనారోగ్యంతో తండ్రి మరణించిన ఒక రోజుకే కొడుకు మృతి చెందిన సంఘటన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఒక్కరోజులోనే తండ్రీకొడుకులు మృతి చెందడం ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. వివ‌రాల్లోకి వెళ్లితే బంజారాహిల్స్‌ రోడ్డు నెం.12లోని సయ్యద్‌నగర్‌ ఫస్ట్‌ లాన్సర్‌లో ముంబైకి చెందిన డి.హరుల్‌ రషీద్‌ (70) నాలుగు నెలలుగా మహ్మద్‌ అఫ్జల్‌ హుస్సేన్‌ ఇంటికి పెయింగ్ గెస్ట్ గా వ‌చ్చి ఉంటున్నారు. ఈ నెల 21వ తేదీన హరుల్‌ రషీద్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతుండ‌గా… ముంబైలో క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు అబ్దుల్ సలామ్ (48)కి అఫ్జ‌ల్ సమాచారం అందించాడు.అబ్దుల్ సలామ్ ఈ నెల 22న హైదరాబాద్ వచ్చి తండ్రిని చూసుకుంటున్నాడు. అయితే ఈ నెల 23న తండ్రి హరుల్ రషీద్ మృతి చెందాడు. కాగా, తండ్రి అంత్యక్రియలు ముగించుకుని 24వ తేదీ మధ్యాహ్నం తెల్లవారుజామున తిరిగి ముంబైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సలామ్‌కు కడుపునొప్పి వచ్చింది. అయితే సలాం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఒక్కరోజులోనే తండ్రీకొడుకులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.