UBER, OLA Fare Tips : ఊబర్, ఓలా ఫేర్ తగ్గాలంటే..!

ఓలా (OLA), ఊబర్ (UBER) డైనమిక్ ఫేర్ (డిమాండ్ కు అనుగుణంగా మారే) విధానం సామాన్యులు,

ఓలా (OLA), ఊబర్ (UBER) డైనమిక్ ఫేర్ (డిమాండ్ కు అనుగుణంగా మారే) విధానం సామాన్యులు, మధ్యతరగతి వాసులకు ఇబ్బందికరమేనని చెప్పుకోవాలి. సాధారణంగా ప్రయాణించాల్సిన దూరం, ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న డ్రైవర్లు, ఎంత మంది కస్టమర్లు రైడ్ బుకింగ్ (Ride Booking) కోసం ప్రయత్నిస్తున్నారు? ఏ వేళలు? ఈ అంశాలన్నీ చార్జీలను నిర్ణయిస్తాయి. ఉన్నట్టుండి ఇలా పెరిగిపోయే చార్జీల భారాన్ని తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు పాటించొచ్చు.

ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వెళ్లేందుకు ఎంత ఖర్చవుతుందో ముందుగానే తెలుసుకునే ఏర్పాటు, ఆన్ లైన్ చెల్లింపులు, డ్రైవర్ల గుర్తింపు, భద్రత.. ఇలా ఎన్నో అనుకూలతలు ఓలా (OLA), ఊబర్ (UBER) రైడ్ ప్లాట్ ఫామ్ ల వల్ల ఏర్పడ్డాయి. ఫలితంగా వీటి వాడకం నిత్య జీవితంలో భాగమైపోయింది. గతంతో పోలిస్తే మొత్తంమీద రైడ్ చార్జీలు పెరగ్గా.. రోజులో అన్ని వేళలా ఒకే చార్జీలు అమలు కావు. డిమాండ్ ను బట్టి ఈ చార్జీలు మారిపోతుంటాయి. ముఖ్యంగా రద్దీ సమయాల్లో రైడ్ కోరుకుంటే 50 శాతానికి పైగా అధిక చార్జీ చూపిస్తాయి.

తప్పనిసరి అయితేనే రద్దీ వేళల్లో ప్రయాణం పెట్టుకోవాలి. సాధారణంగా ఉదయం 8-10 గంటలు, సాయంత్రం 5-8 గంటలు రద్దీ వేళలు. తప్పనిసరి కాకపోతే రద్దీ తక్కువగా ఉండే సమయంలో రైడ్ బుక్ చేసుకోవడం వల్ల చార్జీ తగ్గుతుంది. ఓలా (OLA), ఊబర్ (UBER) మధ్య ధరలను పోల్చి తక్కువ ఉన్నదానిని బుక్ చేసుకోవడం అనే విధానం ఫలితాలను ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే గతంతో పోలిస్తే వీటి చార్జీల విధానం చాలా మెరుగుపడింది. మహా అయితే రూ.10-20 మించి వ్యత్యాసం ఉండడం లేదు.

చార్జీ ఎక్కువగా చూపిస్తుంటే, అక్కడే ఉండి మళ్లీ మళ్లీ రైడ్ సెర్చ్ చేయకండి. దీనివల్ల చార్జీ మరింత పెరిగిపోతుంది. ఎందుకంటే ఎక్కువ సార్లు ట్రై చేయడం వల్ల మీరున్న లొకేషన్ లో డిమాండ్ ఉన్నట్టు రోబోలు సంకేతం పంపిస్తాయి. దీనికి బదులు ఇంటి నుంచి బయటకు వచ్చి, వేరే చోటకు వెళ్లి బుక్ చేసుకోవడం వల్ల కూడా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు.