TSPSC Notifications : TSPSC కి మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల

నూతన సంవత్సరం (New Year) ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం, డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు,

Published By: HashtagU Telugu Desk
Tspsc Notifications

Tspsc Notifications

ఇటీవల పలు ఉద్యోగ నియామకాల ప్రకటనలు విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసింది. నూతన సంవత్సరం ముగింట నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ల ప్రకారం, డిగ్రీ కళాశాలలకు సంబంధించి 544 పోస్టులు, మున్సిపల్ శాఖలో 78 పోస్టులు, ఇంటర్ & టెక్నికల్ ఎడ్యుకేషన్ లో 71 పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే, లేదా జూన్ లో పరీక్ష ఉంటుంది. మున్సిపల్ శాఖలో ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. ఇంటర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలకు సంబంధించి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు TSPSC వెబ్ సైట్ (tspsc.gov.in) ను సందర్శించవచ్చు.

Also Read:  Tirumala Darshanam Record : తిరుమల శ్రీవారిని రికార్డు స్థాయిలో దర్శించుకున్న భక్తులు

  Last Updated: 01 Jan 2023, 12:55 AM IST