Aditya L1: మొదటి మూడు దశలు విజయవంతంగా పూర్తి

చంద్రయాన్3 విజయవంతం కావడంతో ఇప్పుడు ఇస్రో సూర్యనిపై మరో ప్రయోగానికి ముందడుగు వేసింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 (Aditya L1) అనే సోలార్ మిషన్‌ను ప్రారంభించింది.

Aditya L1: చంద్రయాన్3 విజయవంతం కావడంతో ఇప్పుడు ఇస్రో సూర్యనిపై మరో ప్రయోగానికి ముందడుగు వేసింది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్య ఎల్1 అనే సోలార్ మిషన్‌ను ప్రారంభించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఉదయం 11.50 గంటలకు ప్రయోగం జరిగింది. పీఎస్‌ఎల్‌వీ సీ57 రాకెట్‌లో ఈ ప్రయోగం జరిగింది.పిఎస్‌ఎల్‌వి-ఎక్స్‌ఎల్‌సి 57 రాకెట్ శనివారం ఉదయం 11.50 గంటలకు 1480.7 కిలోల ఆదిత్యతో దూసుకెళ్లింది. ప్రయోగం తర్వాత ISAO మొదటి మూడు దశలను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది.

ఆదిత్య ఎల్1 (Aditya L1) భూమికి పదిహేను లక్షల కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలోకి చేరుకుంటుంది. ఇక్కడ నుండి సూర్య సమాచారాన్ని తెలుసుకోవచ్చు. భూమికి 648.7 కి.మీ దూరంలో ప్రయోగించిన 64 నిమిషాల తర్వాత ఆదిత్య రాకెట్ నుంచి విడిపోతుంది. అది తన గమ్యస్థానమైన 1వ లెగ్రాంజ్ పాయింట్‌ను చేరుకోవడానికి 125 రోజుల వ్యవధిలో దాని కక్ష్యను నాలుగుసార్లు పెంచుతుంది. ప్రయోగానికి ముందు నిర్వహించిన పరీక్షలన్నీ విజయవంతమయ్యాయని ఇస్రో తెలిపింది.

ఈ మిషన్ ద్వారా సూర్యుని బయటి భాగాన్ని అధ్యయనం చేయడంతో పాటు, అది భూమి వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో కూడా అధ్యయనం చేయనున్నారు.

Also Read: AP Sand Scam : హ‌వ్వా! ఇసుక‌లో న‌ష్ట‌మా? రూ. 40వేల కోట్ల మోసం గురూ.!