Site icon HashtagU Telugu

Heart Attack: గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి

Heart Attack Blog

Heart Attack Blog

యువత గుండెపోటు సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల చాలామంది ఆస్పత్రుల పాలు కాగా, కొందరు చనిపోయారు కూడా. తాజాగా ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు గుండెపోటు కారణంగా చనిపోయాడు. ఖమ్మం జిల్లా మధిర మండలానికి చెందిన మురళి క్రిష్ట కు హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది.

అయితే ఈ మధ్య హైదరాబాద్ కు వచ్చిన మురళి తన స్నేహితులతో సినిమాకు వెళ్లాడు. అయితే సినిమా చూస్తుండగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రికి తరలించేలోపే చనిపోయాడు. మురళి వయసు 36 మాత్రమే. యువకుడి మరణంతో స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.