Site icon HashtagU Telugu

Snapchat: స్నాప్‌చాట్ లో 150 మంది ఉద్యోగులకు ఉద్వాసన

Snapchat

Snapchat

Snapchat: మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, గూగుల్‌ తదితర టెక్‌ కంపెనీలు మొదలుపెట్టిన ఉద్యోగాల ఊచకోత ప్రభావం ఇతర సంస్థలపై పడింది. తమ సంస్థలలో పని చేసే ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే క్రమంలో ఒక్కొక్కరిని తీస్తున్న పరిస్థితి. తాజాగా స్నాప్‌చాట్ 150 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. AR విభాగంలో తాజా ఉద్యోగాల కోతలు జరిగే అవకాశం ఉంది. గత సంవత్సరం ఆగస్టులో 20 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఆ తర్వాత కూడా ఆర్హికపరమైన సమస్యలు ఉన్న నేపథ్యంలో తాజాగా మరో 150 మందిని వదిలించుకోవాలని భావిస్తుంది.ప్రస్తుతం సంస్థ నష్టాల్లో ఉన్నట్టు నివేదికలు చెప్తున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాలు 7 శాతం తగ్గాయి. ప్రస్తుతం, 6,000 మందికి పైగా ఉద్యోగులు స్నాప్‌చాట్‌తో పని చేస్తున్నారు.

అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు ఐరోపాలో ఇంధన సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదించడం వల్ల పలు ఐటీ కంపెనీలు, ఆర్థిక సంస్థలు ఉద్యోగాల సంఖ్యను తగ్గించడం చేస్తున్నాయి. వివిధ నివేదికల ప్రకారం ఇప్పటికే యునైటెడ్ స్టేట్స్‌లో ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది.

Also Read: Exclusive: నా జీవితాన్ని సినిమా తీయాలని ఎప్పుడూ అనుకోలేదు: ముత్తయ్య మురళీధరన్ ఇంటర్వ్యూ!

Exit mobile version