Site icon HashtagU Telugu

Shocking News: పాతబస్తీలో దారుణం.. శవాలను మింగేస్తున్న పాములు!

Samadhi

Samadhi

హైదరాబాద్‌లోని పాతబస్తీలోని శ్మశానవాటికలో కొన్ని విషసర్పాలు, పైతాన్లు మృత దేహాలను మింగేస్తుండడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం..  స్మశానవాటికలో సమాధుల నుండి మృతదేహాలు కనిపించకుండా పోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫైతాన్లు సమాధుల్లోకి ప్రవేశించి శవాలను మింగేస్తున్నాయని చెబుతారు.

ఓ కొండచిలువ ఒక సమాధి నుంచి మరో సమాధిలోకి వెళ్తున్న ద్రుష్యాలు స్థానికుల్లో ఆందోళన కలిగించాయి. హడలెత్తిస్తున్న ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. పగటిపూట శ్మశానవాటికలోకి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.