Leopards: చిరుతలను వేటాడుతున్న స్మగ్లర్లు.. ఏం చేస్తున్నారంటే!

  • Written By:
  • Updated On - March 14, 2024 / 05:39 PM IST

Leopards: చిరుతపులులను వేటాడి దాన్ని చర్మాన్ని విక్రయించి పెద్దమొత్తంలో సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టడంతో పక్కా ప్లాన్‌ ప్రకారం తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా… విశాఖ మీదుగా చిరుత చర్మాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. అంతేకాదు… పట్టుబడిన ముగ్గురుతో పాటు మరో వ్యక్తి పాత్ర కూడా ఉందని పోలీసులు తెలుసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో.. ముఠాలోని కీలక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

చిరుత చర్మం తరలించేందుకు వారు ఉపయోగించిన కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారువన్యప్రాణి చట్టం-1972లోని నిబంధనల ప్రకారం… తదుపరి విచారణ కోసం నలుగురు నిందితులను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అటవీ అధికారులకు అప్పగించారు.

రుత చర్మాన్ని కూడా అటవీ శాఖ అధికారులకే అప్పగించారు. నిందితులను స్థానిక మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్‌ అయిన వారిలో ఇద్దరు వ్యక్తులు ఒడిశా నుంచి చిరుతపులి చర్మంతో విశాఖపట్నానికి వచ్చినట్టు గుర్తించారు. వారి ద్వారా… చర్మాని కొనుగోలు చేసే వారి సమచారాం కూడా తెలుసుకున్నారు పోలీసులు. ఆరా తీశారు. వారిని డీఆర్‌డీఏ ద్వారా గుర్తించి పట్టుకున్నట్లు నిందితుల విచారణలో కనుగొనబడింది.