న్యూఢిల్లీ: కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అదనపు బాధ్యతలు చేపట్టారు.ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మంత్రి పదవికి రాజీనామా చేయడంతో స్మృతి ఇరానీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. కేంద్ర మంత్రివర్గం నుంచి కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఉక్కు శాఖ మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ల రాజీనామాలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఆమోదించారు.వీరి రాజీనామాలను ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది.
వీరిద్దరి రాజ్యసభ స్యభత్వం జులై 7తో ముగుస్తుంది. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ఉక్కు మంత్రిత్వ శాఖ అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్ నుండి పలువురు బిజెపి నాయకులు రాజ్యసభకు ఎన్నికయ్యారు. అయితే నఖ్వీకి పార్టీ రాజ్యసభ టికెట్ ఇవ్వలేదు. ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కి ఉప రాష్ట్రపతి పదవి వచ్చే అవకాశం ఉందని అందుకే మంత్రి పదవికి రాజీనామా చేయించారనే ప్రచారం జరగుతుంది.