Site icon HashtagU Telugu

Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం

Rajdhani Express

Resizeimagesize (1280 X 720) (2)

చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ (Rajdhani Express)కు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద బి-5 బోగీలో పొగలు వచ్చాయి. దీంతో సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే పొగలు వచ్చినట్లు కావలి రైల్వేస్టేషన్‌ సూపరింటెండెంట్‌ శ్రీహరిరావు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు.

Also Read: Corona Cases: కరోనా విజృంభణ.. భారత్ లో తాజాగా కరోనా కేసులు ఎన్నంటే..?

పూర్తి వివరాలలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఆదివారం చెన్నై-ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. బి-5 కంపార్ట్‌మెంట్ చక్రాల దగ్గర పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. కావలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలును 20 నిమిషాల పాటు నిలిపివేశారు. బ్రేక్ జామ్ కారణంగా పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. మరమ్మతుల అనంతరం రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. అయితే ఈ ఘటనతో పెద్దగా ఇబ్బంది లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.