Site icon HashtagU Telugu

Smart Phone: భార్యాభర్తల మధ్య చిచ్చు పెడుతోన్న స్మార్ట్‌ఫోన్.. సర్వేలో వెలుగులోకి కీలక విషయాలు

Phone Between Couple

Phone Between Couple

Smart Phone: స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనుషులతో మాట్లాడటం చాలావరకు తగ్గిపోయింది. ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్లలో మునిగిపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు ఫోన్‌లో గడుపుతున్నారు. స్మార్ట్‌ఫోన్ మాయలో పడి పక్కవారితో గడపడం కూడా మానేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఎవరూ అసలు అవసరం లేదనేలా మనుషులు ప్రవర్తిస్తున్నారు. తిండి తిప్పలు మానేసి ఎక్కువగా ఫోన్‌లోనే సమయం గడిపేస్తున్నారు.

చివరికి భార్యాభర్తల మధ్య కూడా స్మార్ట్‌ఫోన్ చిచ్చు పెడుతోంది. స్మార్ట్‌ఫోన్ల వల్ల భార్యాభర్తలు మాట్లాడుకోవడం మానేశారని, దీని వల్ల దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ల వద్ద కాపురాలు కూలిపోతున్నాయని ఓ సర్వేలో తేలింది. పెళ్లయిన 10 మందిలో 8 మంది దంపతుల కాపురాల్లో స్మార్ట్‌ఫోన్ చిచ్చు పెడుతుందని ఓ సర్వేలో తేలింది.

పెళ్లైన 10 మంది దంపతుల్లో 8 మంది కంటే ఎక్కువ మంది ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించడం వల్ల సంబంధాలు దెబ్బతింటున్నాయని సర్వేలో తెలిపింది. 67 శాతం మంది ప్రజలు తమ భాగస్వామితో మాట్లాడే సమయంలో కూడా స్మార్ట్‌ఫోన్ వాడుతున్నట్లు సర్వేలో తేలింది. స్మార్ట్‌ఫోన్ల వల్ల 66 శాతం భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నట్లు సైబర్ మీడియా రీసెర్చ్, వీవో సంస్ధలు కలిసి నిర్వహించిన సర్వేలో బయట్టబయలైంది.

70 శాతం మంది స్మార్ట్‌ఫోన్‌లో పడి తమ భాగస్వాములను పట్టించుకోవడం మానేశారని, దీని వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు వస్తున్నాయని సర్వేలో బయటపడింది. 69 శాతం మంది తమ భాగస్వామితో మాట్లాడే సమయంలో శ్రద్ద పెట్టడం లేదని సర్వేలో తేలింది. 88 శాతం మంది అర్థవంతమైన సంభాషణల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు సర్వేలో తేలిందని వివో ఇండియా హెడ్ బ్రాండ్ స్ట్రాటజీ యోగేంద్ర శ్రీరాములు స్పష్టం చేశారు. భార్యాభర్తల మధ్య విడాకులకు కూడా ఇది దారి తీస్తుందని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువసేపు గడుపుతూ తమ భాగస్వామితో సరిగ్గా మాట్లాడటం లేదని, దీని వల్ల స్మార్ట్‌ఫోన్ పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతుందని ఆయన చెబుతున్నారు