AP Power: ఏపీలో ప్రీపెయిడ్ విద్యుత్ షాక్

ఏపీలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. మరో రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా స్మార్ట్ మీటర్ల ప్రయోగం జగన్ సర్కార్ చేయబోతోంది.

  • Written By:
  • Publish Date - February 7, 2022 / 09:45 PM IST

ఏపీలో ప్రీపెయిడ్ స్మార్ట్ విద్యుత్ మీటర్లు రాబోతున్నాయి. మరో రెండు వారాల్లో విశాఖ కేంద్రంగా స్మార్ట్ మీటర్ల ప్రయోగం జగన్ సర్కార్ చేయబోతోంది.
ప్రయోగాత్మకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం అయింది. ప్రస్తుతం నెలకు వినియోగిస్తున్న యూనిట్ల మేరకే విద్యుత్తు బిల్లు మొత్తాన్ని నగదు,డిజిటల్ రూపంలో డిస్కంలకు చెల్లిస్తున్నారు.
ఇకపై ముందుగానే డబ్బులు చెల్లించి సరిపడా విద్యుత్తును కొనుగోలు చేయడానికి ఏపీ ప్రజలు సిద్దం కావాల్సిందే. ఆ మేరకు ప్రీపెయిడ్ మీటర్లను అందుబాటులోకి తెస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఐబోట్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రయోగాత్మకంగా ఈ మీటర్ల ఏర్పాటుకు ముందుకు వచ్చింది.
రాష్ట్రంలో తొలిసారి విశాఖలో ప్రయోగాత్మకంగా 100 చోట్ల ఈ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేశారు.
విశాఖ సర్కిల్ కార్యాలయంలోని జోన్-1 పరిధిలో 95 సింగిల్ ఫేజ్, 5 త్రీఫేజ్ కనెక్షన్లకు ఈ మీటర్లను అనుసంధానం చేసి పరీక్షిస్తున్నారు.
బ్యాలెన్స్,రీఛార్జ్ సమాచారం వినియోగదారులకు చేరవేయడం లాంటి సాంకేతిక అంశాలను పరిశీలించడం సహా ప్రీపెయిడ్ మీటర్ల పనితీరును అంచనా వేశారు.మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి లో ప్రీ పెయిడ్ మీటర్లు పద్ధతి రాబోతుంది.