Site icon HashtagU Telugu

Earthquake: సంగారెడ్డిలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

Earthquake

Earthquake

Earthquake: సంగారెడ్డి జిల్లాలో శనివారం సాయంత్రం భూకంపం సంభవించింది. జిల్లా కేంద్రంతోపాటు న్యాల్‌కల్‌, ముంగి తదితర గ్రామాల్లో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఏ మేరకు భూకంపం సంభవించిందనేది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా భూకంపంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇటీవల భూకంపాలు పట్టి పీడిస్తున్నాయి. తరుచూ భూకంపాల వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.ఇటీవల కాలంలో భారత్, అండమాన్ నికోబార్ దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, ఇండోనేషియా, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. గత సంవత్సరం టర్కీ, సిరియాలో ఏర్పడిన భూకంపం కారణంగా 50 వేల మంది మరణించారు.

Also Read: CM Revanth Reddy: తెలంగాణలో కుల గణన ప్రక్రియకు సీఎం రేవంత్ ఆదేశం