Skanda: ఓటీటీలోకి వచ్చేస్తున్న స్కంద, స్ట్రీమింగ్ ఎప్పుడంటే

భారీ అంచనాల మధ్య విడుదలైన హీరో రామ్, బాలయ్య కాంబినేషన్ స్కంధ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది.

Published By: HashtagU Telugu Desk
Ram Skanda Movie Pre Releas

Ram Skanda Movie Pre Releas

Skanda: భారీ అంచనాల మధ్య విడుదలైన హీరో రామ్, బాలయ్య కాంబినేషన్ స్కంధ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. యువ నటులకు హిట్ ఇవ్వలేరని బోయపాటి మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. కాగా ఈ మూవీ సుమారు రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన స్కంద అక్టోబరు 27వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ‘స్కంద’ అందుబాటులోకి రానుంది.

థియేటర్లలో రిలీజైన 50 రోజుల తర్వాతే ఓటీటీలోకి తీసుకురావాలని మొదట స్కందతో ఒప్పందం కుదిరిందట. అయితే ఇప్పుడు ముందుగానే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు సమాచారం. స్కంద సినిమాకు థమన్‌ స్వరాలు సమకూర్చారు. బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్‌ సాంగ్‌లో సందడి చేసింది. సిల్వర్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై శ్రీనివాస్‌ చిట్టూరి, పవన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

  Last Updated: 24 Oct 2023, 12:41 PM IST