Six People Died: జమ్మూలోని కథువాలో బుధవారం తెల్లవారుజామున ఓ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. సమాచారం ప్రకారం.. ఇంట్లో 9 మంది నిద్రిస్తుండగా వారిలో 6 మంది ఊపిరాడక మరణించగా (Six People Died), 3 మంది అపస్మారక స్థితికి చేరుకున్నారు. కథువాలోని శివనగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
సమాచారం ప్రకారం.. సహాయం చేయడానికి ముందుకు వచ్చిన పొరుగు వారు కూడా అపస్మారక స్థితిలో చేరారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తులు కతువాలోని జిఎంసిలో చికిత్స పొందుతున్నారు. షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. గంగా భగత్ (17 సంవత్సరాలు), డానిష్ భగత్ (15 సంవత్సరాలు), అవతార్ కృష్ణ (81 సంవత్సరాలు), బర్ఖా రైనా (25 సంవత్సరాలు), తకాష్ రైనా (3 సంవత్సరాలు), అద్విక్ రైనా (4 సంవత్సరాలు) అగ్నిప్రమాదంలో మరణించారు. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక దళం వాహనాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
కథువా జిల్లాలోని శివనగర్‌లో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ ఘోర ప్రమాదంలో 6 మంది చనిపోయారు. మరోవైపు నలుగురిని రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రిటైర్డ్ అసిస్టెంట్ మేట్రన్ అద్దె ఇంట్లో మంటలు చెలరేగాయని కథువా జిఎంసి ప్రిన్సిపాల్ ఎస్‌కె అత్రి తెలిపారు. 10 మందిలో 6 మంది మరణించగా, 4 మంది గాయపడ్డారు. ఊపిరాడక మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బయటకు తీయనున్నారు.
Also Read: New Revenue Act : ఇవాళ అసెంబ్లీలోకి ‘కొత్త రెవెన్యూ చట్టం’ బిల్లు.. కీలక అంశాలివీ
అగ్నిమాపక విచారణ జరుగుతోంది
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయితే మంటలు ఎగసిపడటంతో చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆలస్యం అయింది. ఊపిరాడక మృతి చెందినట్లు జిఎంసి కథువా ప్రిన్సిపాల్ డాక్టర్ సురీందర్ అత్రి తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇంట్లో నిద్రిస్తున్న వారు మంటల్లో చిక్కుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ బాధాకరమైన సంఘటన యావత్ ప్రాంతాన్ని కలచివేసింది. మృతుల కుటుంబీకులు రోదనలు మిన్నంటాయి. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.