పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని లక్కీ మార్వాత్ నగరంలో ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఇందులో ఆరుగురు పోలీసులు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హఫ్తావారీ జాతరలో పోలీసులు మొబైల్ సెక్యూరిటీ కోసం వ్యాన్ లో వెళ్తుండగా దాడివాలా పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్‌పై వచ్చిన ఉగ్రవాదులు మొబైల్ వ్యాన్ పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు చనిపోయారు.
ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారిలో డ్రైవర్, డ్యూటీ ఇన్‌ఛార్జ్ ఏఎస్‌ఐ కూడా ఉన్నారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ దాడిలో మరణించిన మిగిలిన వారిని అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఆలం దీన్, కానిస్టేబుల్ పర్వేజ్, అహ్మద్, దిల్జాన్, అబ్దుల్లా, మెహమూద్‌లుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు బృందం పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా పోలీసు అధికారి తెలిపారు. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఈ విషయాన్ని తెలుసుకొని.. ఐజి పోలీసుల నుండి సంఘటనపై నివేదిక కోరారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.