Site icon HashtagU Telugu

Uttar Pradesh: దారుణం.. షార్ట్ సర్క్యూట్ తో ఒకే కుటుంబంలో ఆరుగురు సజీవదహనం?

Uttar Pradesh

Uttar Pradesh

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఊహించని ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ఈ దారుణమైన ఘటనల వల్ల ఒకరు ఇద్దరు కాదండోయ్ ఏకంగా కుటుంబం మొత్తం అందరూ కూడా మృత్యువాత పడుతున్నారు. రోడ్డు ప్రమాదాల బారిన పడి ఈ మధ్యకాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. అలాగే వేసవికాలం కావడంతో ఎక్కడ చూసినా కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాద ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలా షార్ట్ సర్క్యూట్ కారణంగా కుటుంబం మొత్తం సజీవ దహనం అయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ లోని సుశినగర్ జిల్లాలో ఈ అగ్ని ప్రమాదం ఘటన జరిగింది. ఉర్దా ప్రాంతంలో సంగీత అనే 38 ఏళ్ల వివాహిత తన పిల్లలతో కలిసి ఇంట్లో నిద్రిస్తోంది. ఆమె భర్త అత్తమామలు ఇంటి బయట నిద్రిస్తున్నారు. అయితే అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. దాంతో క్షణాల్లోనే ఇల్లంతా మంటలు వ్యాపించాయి. ఇక లోపల నిద్రిస్తున్న సంగీత ఆమె పిల్లల అరుపులు విన్న భర్త అత్తమామలు స్థానికులతో కలిసి లోపల ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేశారు.

మంటల తీవ్రత అధికంగా ఉండడంతో లోపలికి వెళ్లలేకపోయారు. ఇంతలోనే అక్కడికి చేరుకున్న అజ్ఞాపక సిబ్బంది మంటలను అదుపు చేసి లోపల ఉన్న వారిని బయటికి తీసుకువచ్చారు. అయితే అప్పటికే వారందరూ కూడా మృతి చెందారు. లోపల ఇంట్లో సంగీత తో పాటు ఒక ఏడాది వయసున్న బాబు రెండేళ్ల గీత అనే పాప మూడేళ్ల రీత అనే పాప 9 ఏళ్ల లక్ష్మీన, పదేళ్ల అంకిత్ లు ఆ మంటల దెబ్బకు సజీవ దహనం అయ్యారు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ఆరు మంది సజీవ దహనం అవడంతో భర్త అత్తమామలు వారిని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో పాటు చనిపోయిన ఒక్కొక్కరికి నాలుగు లక్షల చొప్పున మొత్తం 24 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయన్నట్లు ప్రకటించారు.

Exit mobile version