Site icon HashtagU Telugu

AP Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీలు ఢీ… ఆరుగురి మృతి

Accident

Accident

ఆంధ్రప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలనాడు జిల్లాలోని రెంటచింతల సమీపంలో సిమెంటు లోడ్ తో ఆగి ఉన్న లారీని, మరో మినీ లారీ వేగంగా వచ్చి ఢీకొంది. ఆదివారం రాత్రి 11.50 గంటలకు జరిగిన ఈ ఘటన లో మినీ లారీలో ఉన్న ఆరుగురు మృతి చెందారు.

ఇంకొందరికి తీవ్ర గాయాలయ్యాయి. రెంట చింతలలోని వడ్డెరబావి కాలనీకి చెందిన 38 మంది వ్యవసాయ కూలీలు మినీ లారీలో శ్రీశైలం దర్శనానికి వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి రెంటచింతలకు వస్తుండగా.. కాసేపైతే ఇంటికి చేరుకుంటారనగా ఈ విషాద ఘటన జరిగింది. రెండు లారీలు ఢీకొనగానే.. మినీ లారీలో ఉన్నవారంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు.

పరిసర ప్రాంత ప్రజలు స్పందించి వెంటనే వారిని గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులను నారాయణపురం రోశమ్మ, మక్కెన రమణ, అన్నవరపు కోటమ్మ, కురిసెటి రమాదేవి, పెద్దారపు లక్ష్మీనారాయణ, పులిపాడు కోటేశ్వరమ్మ గా గుర్తించారు.