Site icon HashtagU Telugu

Vaisshnav Tej: పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా కొత్త సినిమా!

Vishnav Tej

Vishnav Tej

పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపు దిద్దుకోవటానికి రంగం సిద్ధమైంది. నేడు వైష్ణవ్ తేజ్  పుట్టిన రోజు సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ లు ఈ మేరకు అధికారిక ప్రకటన ను ఓ వీడియో రూపంలో విడుదల చేశాయి. తొలిచిత్రం తోనే స్టార్ గా ప్రేక్షక హృదయాలలో బలమైన స్థానాన్ని సంపాదించుకున్న వైష్ణవ్ తేజ్ సరికొత్త  మాస్ అవతారం ఈ చిత్రం అనిపిస్తుంది. అంతేకాదు భారీస్థాయిలో నిర్మాణం జరుగుతుందనిపిస్తుంది ఈ వీడియోను పరికిస్తే. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య.  ఇప్పటికే ధనుష్ హీరోగా తెలుగు, తమిళం లో  నిర్మితమవుతున్న ‘సార్’, నవీన్ పోలిశెట్టి హీరో గా మరోచిత్రం, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘ డిజే టిల్లు’, చిత్రాలు సితార ఎంటర్ టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణం లో నిర్మిత మవుతున్న విషయం విదితమే.
Exit mobile version