Atiq Ashraf Murder Case: మోతీలాల్ నెహ్రూ డివిజనల్ హాస్పిటల్ కాల్విన్ గేటు వద్ద అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఇదే హత్య మళ్ళీ ఈ రోజు పునరావృతమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు టేప్ కొలతతో అతిక్ మరియు దాడి చేసిన వ్యక్తుల మధ్య దూరాన్ని కొలుస్తూ మొత్తం దృశ్యాన్ని రీ క్రియేషన్ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రి చుట్టూ పోలీసులు మోహరించారు.
ఏప్రిల్ 15 రాత్రి కాల్విన్ హాస్పిటల్ గేట్ వద్ద అతిక్ మరియు అష్రఫ్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మరణించారు. అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్ త్రిపాఠి, మాజీ డీజీపీ సుబేష్ కుమార్ సింగ్, మాజీ న్యాయమూర్తి బ్రిజేష్ కుమార్ సోనీ నేతృత్వంలో ఏర్పాటైన కమిషన్ విచారణకు సంబంధించి గురువారం ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంది. విచారణ సమయంలో కమిషన్ పోలీసులను కూడా విచారించనుంది. ఈ కేసు విచారణను 2 నెలల్లో పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు.
ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్-అష్రాఫ్‌లను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. అయితే మెడికల్ చెకప్ కోసం కాల్విన్ ఆసుపత్రి వద్ద మీడియా ప్రతినిధుల వేషధారణలో వచ్చిన అరుణ్ మౌర్య, లవ్లేష్ తివారీ, సన్నీ వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అనంతరం రెండు చేతులు పైకెత్తి పోలీసులకు లోగిపోయారు.
