TSPSC Case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తుంది.

TSPSC Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తుంది. ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఓ వైపు విద్యార్థుల భవిష్యత్తు, మరోవైపు ప్రతిపక్షాల ఒత్తిడితో సిట్ వేగం పెంచింది. ఈ కేసులో తాజాగా మరో మందిని అరెస్ట్ చేసింది. ఇప్పటివరకు టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మొత్తం 74 మంది అరెస్ట్ అయ్యారు.

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మార్చిలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఎస్‌ఓ) పి ప్రవీణ్ కుమార్ (32), టిఎస్‌పిఎస్‌సిలో నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎ రాజశేఖర్ (35), రేణుక (35) స్కూల్ టీచర్, ఎల్ ధాక్య (38) టెక్నికల్‌ని అరెస్టు చేశారు. ఇదే కేసులో సహాయం చేసిన కె రాజేశ్వర్ (33), కె నీలేష్ నాయక్ (28), పి గోపాల్ నాయక్ (29), కె శ్రీనివాస్ (30), కె రాజేంద్ర నాయక్ (31) లను సిట్ అదుపులోకి తీసుకుంది.

Read More: Social Media Apps Down : ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ డౌన్.. వేలాదిమంది అవస్థ